అన్నయ్యపై తమ్ముడు అసంతృప్తి

అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిపై తమ్ముడు నాగబాబు అసంతృప్తితో ఉన్నాడట. ఇంతకీ ఏ విషయంలో ? అంటే.. మెగాస్టార్ కెరీర్ లో 150 సినిమాలు పూర్తి చేశాడు. దాదాపు పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా.. ఇప్పటికీ టాలీవుడ్ నెం.1 తానేనని నిరూపించుకొన్నాడు. చిరు రీ-ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నెం.150’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నాన్ బాహుబలి రికార్డులని బ్రేక్ చేసింది.

ఐతే, ఇప్పటి వరకు చిరుకి జాతీయ అవార్డు రాకపోవడంపై నాగబాబు అసంతృపితో ఉన్నాడట. వాస్తవానికి ‘రుద్రవీణ’ సినిమాకు గానూ అన్నయ్యకు జాతీయ అవార్డ్ రావాల్సివుంది. కానీ, కొన్ని కారణాల వలన రాలేదు. చిరు 151 ‘సైరా’తోనైనా చిరుకి నేషనల్ అవార్డు రావాలని నాగబాబు ఆకాంక్షిస్తున్నారు. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథగా సైరా తెరకెక్కింది. సురేంధర్ రెడ్డి దర్శకత్వం వహించారు. దాదాపు రూ. 250కోట్లతో రామ్ చిరణ్ నిర్మించారు. అక్టోబర్ 2 సైరా రాబోతుంది.