బ్లాక్ లిస్టులో పాక్.. !

పాకిస్థాన్ కి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పాక్ ని బ్లాక్ లిస్టులో పెట్టింది. టెర్రరిస్ట్ సంస్థలకి ఆర్థిక సాయం చేయడం, మనీ లాండరింగ్ కు పాల్పడమే ఇందుకు కారణమని తెలిపింది. ఈ విషయంలో అక్టోబర్ లోగా పాక్ చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేనియెడల ఆ దేశాన్ని ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్టులో పెట్టనుంది.

ఎఫ్ఏటీఎఫ్ పాక్ ని బ్లాక్ లిస్టులో పెడితే ఏమవుతుంది ? అంటే.. అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలపై నిఘా ఉంచే సంస్థ ఎఫ్ఏటీఎఫ్. ఈ సంస్థ గనుక పాక్ ని బ్లాక్ లిస్టులో పెడితే.. ఆ దేశం క్రెడిట్ రేటింగ్ పడిపోతుంది. దీంతో పాక్ ర్యాంకింగ్ ను ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ లు డౌన్ గ్రేడ్ చేస్తాయి.