రాజ్ తరుణ్ అరెస్ట్.. విడుదల !
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం హైదరాబాద్ నార్సింగిలో రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయనకి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం తర్వాత కారుని అక్కడే వదిలేసి రాజ్ తరుణ్ వెళ్లిపోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో రాజ్ తరుణ్ తాగి ఉన్నాడని.. అందుకే ఆయన పారిపోయాడనే విమర్శలొచ్చాయ్. ఐతే, తాను భయంతో మాత్రమే పరుగులుపెట్టాను. ఇంటికి వెళ్లానని రాజ్ తరుణ్ తెలిపారు.
ఈ ఘటనలో రాజ్ తరుణ్ పై 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో రాజ్ తరుణ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్ పై రాజ్ తరుణ్ విడుదలయ్యాడు. మరోవైపు, కారు ప్రమాదం తర్వాత పారిపోతున్న రాజ్ తరుణ్ ను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన కార్తీక్ పై కూడా మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన్ని కూడా అదుపులోనికి తీసుకొంటామని పోలీసులు తెలిపినట్టు తెలుస్తోంది.