కోడలుతో వెంకీ రొమాంటిక్ పోజు చూశారా ?
విక్టరీ వెంకటేష్ మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. సినిమాలోనూ మామా-అల్లుళ్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. వెంకీకి జంటగా పాయల్ రాజ్ పుత్, నాగ చైతన్యకి జంటగా రాశీఖన్నా జతకట్టనుంది. ప్రస్తుతం జెడ్ స్పీడుతో వెంకీమామ షూటింగ్ జరుపుకుంటోంది. ఐతే, షూటింగ్ లొకెషన్ లో వెంకీ మామతో రాశీఖన్నా రొమాంటిక్ పోజులో దిగిన ఫోటో ఒకటి బయటికొచ్చింది. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక, ‘వెంకీమామ’ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’కు పోటీగా అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఐతే, సైరాకు పోటీకి దిగడం వెంకీకి ఇష్టం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో వెంకీమామ నవంబర్ కి వెళ్లే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా తర్వాత చైతూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. వెంకీ నెక్ట్స్ సినిమా ఏంటన్నది తెలియాల్సి ఉంది.