హరీష్ శంకర్ లెక్క తేలింది.. !

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే కథానాయిక. 14రీల్స్ నిర్మిస్తోంది. సెప్టెంబర్ 13న ‘వాల్మీకి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, ఈ సినిమా విషయంలో నిర్మాతలకు-డైరక్టర్ కు మధ్య వచ్చిన సమస్యలు అన్నీ తొలగిపోయి, ఓ ఒప్పందం కుదిరినట్లు వినిపిస్తోంది. సినిమా ప్రారంభంలో లాభాల్లో వాటా అన్న ప్రాతిపదికన హరీష్ శంకర్ రంగంలో దిగారు. కానీ సినిమా మేకింగ్ కు అనుకున్నదాని కన్నా కాస్త గట్టిగానే ఖర్చయనట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 30కోట్లు ఖర్చు చేశారు.

అది కూడా డైరెక్టర్ రెమ్యూనరేషన్ కాకుండానే. ఈ నేపథ్యంలో నిర్మాతలు-దర్శకుడు వాటాల వ్యవహారం పక్కనపెట్టి, సెటిల్ మెంట్ కు కూర్చున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ గా హరీష్ శంకర్ కు రూ. 7కోట్ల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశారు. ‘డీజే’ సినిమా కోసం హరీష్ రూ. 8కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొన్నారు. అల్లు అర్జున్ ఫాలోయింగ్ వేరు. దాని లెక్కలు వేరు. అందుకని వాల్మీకి కోసం ఓ కోటి తగ్గించుకొని.. రూ.7కోట్ల రెమ్యూనరేషన్ కి అంగీకరించారు. అంతేకాదు.. ఇందులో నుంచి ఓ రెండున్నర కోట్లు పెట్టి వాల్మీకి ఉత్తరాంధ్ర రైట్స్ తీసుకొన్నారు హరీష్. మొత్తానికి.. వాల్మీకి వివాదం ముగిసిపోయింది.