సల్మాన్ కి నో చెప్పిన శ్రద్దా !

బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ ‘సాహో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ నేపథ్యంలో శ్రద్దా గురించి పూర్తిగా తెలుసునే అవకాశం తెలుగు ప్రేక్షకులకి దక్కింది. సాహో ప్రమోషన్స్ లో పాల్గొన్న శ్రద్దా.. కెరీర్ లో పలు ఆసక్తికర విషయాల గురించి చెప్పింది. శ్రద్దా 16యేళ్ల వయసులో ఉన్నప్పుడే స్కూల్‌ నాటకంలో శ్రద్దాని చూసిన సల్మాన్ ఖాన్ ఆఫర్ ఇచ్చారట.

ఆ సమయంలో చదువుకోవాలని కోరికతో ఉన్న శ్రద్దా సల్మాన్ నో చెప్పిందట. అమెరికాలోని బోస్టన్‌ యూనివర్సిటీలో సైకాలజీ చదవడానికి వెళ్లిందట. ఫస్టియర్‌ పూర్తిచేసి వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన టైమ్‌లో ఫేస్‌బుక్‌లో శ్రద్దా ఫొటోలు చూసిన నిర్మాత అంబికా హిందుజా ‘తీన్‌ పత్తీ’లో ఆఫర్ ఇచ్చారట. ఈ సినిమాలో అమితాబ్‌, బెన్‌కింగ్స్‌లే, మాధవన్‌ నటించారు.

ఆ తర్వాత ‘లవ్‌ కా ది ఎండ్‌’, ‘ఆషికీ 2’, ‘ఔరంగజేబ్‌’, ‘ఏక్‌ విలన్‌’, ‘హైదర్‌’, ‘ఏబీసీడీ 2’, ‘రాక్‌స్టార్‌ 2’, ‘ఓకే జానూ’, ‘స్త్రీ’ చిత్రాల్లో నటించింది. శ్రద్దా నటిస్తున్న తొలి తెలుగు సినిమా సాహో. ఇందులో శ్రద్దా యాక్షన్ సీన్స్ కూడా చూసింది. టీజర్, ట్రైలర్ లోనే అవి ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఇక సినిమాలో శ్రద్దా పూర్తి యాక్షన్ ని చూడొచ్చు. ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు. యూవీ క్రియేషన్ నిర్మించింది. ఈ నెల 30న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.