ఏపీకి 4 రాజధానులు.. జగన్ ఆలోచన ఇదే !
ఏపీ ప్రస్తుత రాజధాని అమరావతి అంత సురక్షితం కాదు. త్వరలోనే ఏపీ రాజధాని విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుందని మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బొత్స వాఖ్యలని వైకాపా నేతలు సమర్థించారు. రాజధాని విషయంలో తమకు కేంద్రం అండదండలున్నాయని అన్నట్టుగా వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్ది అన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని తథ్యమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇంతకీ సీఎం జగన్ మనసులో ఏముంది ? అమరావతి నుంచి రాజధానిని ఎక్కడికి తరలిస్తారు ? అనే ప్రశ్నలు ఏపీ ప్రజలని వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాజపా ఎంపీ టీజీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 4 ప్రాంతాల్లో 4 రాజధానులు పెట్టే యోచనలో జగన్ ఉన్నట్లు టీజీ చెప్పారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సీఎం ముందుకు వెళ్తున్నారన్నారు. ఆయన చేసే పనిని ప్రజలు హర్షిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. అమరావతి మీదే దృష్టి పెట్టడంతో ఎన్నికల్లో తెదేపా సహా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కూడా ఓడిపోయారని టీజీ అన్నారు.