అది తప్పే.. కానీ తగ్గడట !


చైనాతో వాణిజ్య యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చాత్తాప పడుతున్నట్లు తెలిసింది. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో అల్పాహార విందు సందర్భంగా మాట్లాడిన ట్రంప్.. చైనాతో వాణిజ్య యుద్ధం విషయంలో పశ్చాత్తాప పడుతున్నట్లు చెప్పారట. అయినా తగ్గలేదు లేదన్నారట. ‘అవును.. చైనాతో వాణిజ్య యుద్ధానికి దిగినందుకు పశ్చాత్తాప పడుతున్నాను. అయితే, ప్రతిదానికి నా దగ్గర ప్రత్యామ్నాయం ఉంది’ అన్నారు ట్రంప్.

250 బిలియన్‌ డాలర్ల చైనా వస్తువులపై శుక్రవారమే 25శాతం నుంచి 30శాతం సుంకాలు విధించారు. మిగిలిన 300 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై 10 నుంచి 15శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. వచ్చే నెలలో మరికొన్ని వస్తువులపై విధించనున్నట్లు తెలిపారు. ఒక పక్క పశ్చాత్తాప పడుతూనే చైనా ఇదే విధంగా దుందుడుగా వ్యవహరిస్తే, వాణిజ్య యుద్ధాన్ని మరింత పెంచేందుకు తాను వెనకాడబోనని హెచ్చరించారు. ట్రంప్‌ చైనాలోని అమెరికా కంపెనీలను వెనక్కి రప్పించే సామర్థ్యం తనకు ఉందున్నారు ట్రంప్.