ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధు


భారత ఏస్ షట్లర్ , తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచింది. ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరపై 21-7, 21-7 తేడాతో ఘనవిజయం సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డులకెక్కింది. తొలి రౌండ్‌లో (21-7) అదరగొట్టిన పీవీ సింధు.. రెండో రౌండ్‌లోనూ దూసుకెళ్లింది.రెండో గేమ్‌లో ఆదినుంచే పాయింట్లు సాధిస్తూ ఒకుహరపై పైచేయి సాధించింది. విరామానికి 11-4తో అదరగొట్టింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించి 21-7తో విజేతగా నిలిచింది. స్వర్ణ పథకం సాధించిన సింధుపై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ సింధుని అభినందిస్తూ ట్విట్ చేశారు