పాదయాత్ర కోసం కోమట్ రెడ్డి కోర్టుకెళ్తారట !

తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలు రాజకీయ నాయకులకి పెద్ద పదవులని తెచ్చిపెట్టిన సందర్భాలని చూశాం. తన పాదయాత్రతో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన కొడుకు, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కూడా పాదయాత్ర ద్వారాని పైకొచ్చాడు. ఏపీలో ఘన విజయం సాధించాడు. తన లక్ష్యాన్ని అందుకొన్నాడు. ప్రస్తుతం ఏపీ సీఎంగా తనదైన ముద్రవేస్తున్నారు. ఇక 2009లో తెదేపా అధికారంలోకి రావడానికి చంద్రబాబు చేసిన పాదయాత్ర కీలక భూమిక పోషించింది.

తెలంగాణలో తెరాస అధికారంలోకి రావడానికి కారణం ఉద్యమ యాత్ర. ప్రత్యేక తెలంగాణ కోసం పేగులు తెగదేక కొట్లాడిర్రు. కేసీఆర్ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆమరణనిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే.. ? భువనగిరి ఎంపీ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి కూడా పాదయాత్ర చేసేందుకు తహ తహ లాడుతున్నారు. ఇందుకోసం పోలీసుల అనుమతి కోసం ప్రయత్నించినా పనికాలేదు. ఈ నేపథ్యంలో కోర్టుకెళ్తా. హైకోర్టు అనుమతితో నార్కట్ పల్లి నుంచి పాదయాత్ర చేస్తాన అంటున్నారు. మరీ.. పాదయాత్ర వెనక వెంకట్ రెడ్డి ఆశిస్తున్న ప్రతిఫలం ఏంటో.. !?