ఇకపై మట్టి కప్పుల్లో గరం ఛాయ్‌ !

త్వరలోనే రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్‌ల్లోని స్టాళ్లు, విమానాశ్రయాలు, షాపింగ్‌ మాల్స్‌లో మట్టి కప్పుల్లో ఛాయ్ అందుబాటులోకి రానుంది. ఈ దిశగా కేంద్రం ప్రయత్నాలు వేగవంతం చేస్తోంది. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్గరీ ఈ మేరకు రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌కు లేఖ రాశారు. వంద రైల్వేస్టేషన్లలో ఛాయ్ కోసం మట్టికప్పులను తప్పనిసరి చేయాల్సిందిగా కోరారు. ప్రస్తుతం వారణాశి, రాయ్‌బరేలీ రైల్వేస్టేషన్లలో మట్టి కప్పులు, మట్టి ప్లేట్లనూ వాడుతున్నారు.

మెల్లగా అన్నిరకాల ప్రయాణప్రాంగణాల వద్ద మట్టి గ్లాసులు, మట్టి కప్పుల వాడకాన్ని పెంచడం వల్ల స్థానిక మట్టిపాత్రల తయారీదారులకు ఎంతో ప్రయోజనకరమవుతుందని కేంద్రం భావిస్తోంది. మట్టి కప్పులతో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా కొంతవరకు తగ్గించవచ్చు. దాంతోపాటుగా మృణ్మయపాత్రల తయారీదారులకు ఉపాధి కలిగించినట్టు అవుతుందని భావిస్తున్నారు. ఇదో మంచి ఆలోచన. దానికి ప్రజల నుంచి మంచి స్పందన దక్కుతోంది. త్వరలో మట్టికప్పుల్లో గరం ఛాయ్ ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి మరీ.. !