సాహో+సైరా = రూ. 600కోట్లు


కేవలం నెల రోజుల వ్యవధిలో టాలీవుడ్‌ నుంచి రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకటి ‘సాహో’ అయితే రెండోది ‘సైరా’. ఈ రెండు చిత్రాల మొత్తం బడ్జెట్‌ ఇంచుమించుగా రూ.600 కోట్లు. ‘సాహో’ బడ్జెట్‌ రూ.300 నుంచి రూ.350 కోట్ల వరకూ ఉంటుందని తెలుస్తోంది. బడ్జెట్‌ ఇంత అని చిత్రబృందం చెప్పడం లేదు గానీ, ఈ అంకెలకు దగ్గరగానే ఖర్చు చేశారు. నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయడం ‘సాహో’కి కలిసొచ్చే అంశం. సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 300కోట్లకిపైగా జరిగినట్టు టాక్.

తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని సినిమాగా తీయాలన్నది చిరంజీవి ఆశ.. ఆలోచన. దాదాపుగా పదేళ్ల నుంచీ ఈ కల కంటున్నారాయన. సైరా నరసింహారెడ్డి’ని పాన్‌ ఇండియా సినిమాగా తీర్చిదిద్ది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ‘సైరా’ కోసం దాదాపు రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకూ ఖర్చు పెట్టారు. చిరంజీవి కెరీర్‌లో ఇదే అత్యంత ఖరీదైన చిత్రం. మొత్తంగా సాహో, సైరా కలిపి దాదాపు రూ. 600కోట్ల బడ్జెట్ తో తెరకెక్కాయి. ఐతే, ఈ రెండు చిత్రాలు ఒకనెల గ్యాప్ లోనే ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం.