బావబామ్మర్థి ఒకేసారి కేబినేట్ లోకి.. !

తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే తన కేబినేట్ విస్తరణ చేపట్టబోతున్నట్టు సమాచారమ్. ప్రస్తుతం తెలంగాణ మంత్రి వర్గంలో సీఎం సహా 12మంది ఉన్నారు. మరో ఆరుగురుని కేబినేట్ లోకి తీసుకోవాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. ఐతే, ఆరుగురుని ఒకేసారి తీసుకోకుండా రెండు విడతలుగా కేబినేట్ విస్తరణని ప్లాన్ చేసినట్టు సమాచారమ్. దసరా తొలి కేబినేట్ విస్తరణ. ఇందులో భాగంగా ముగ్గురిని కేబినేట్ లోకి తీసుకోనున్నారు. ఆ లిలిస్టులో గుత్తా, కేటీఆర్, హరీష్ రావు పేర్లు వినిపిస్తున్నాయి.

ఇక వచ్చే యేడాది సంక్రాంతికి రెండో కేబినేట్ విస్తరణ ఉండనుందని తెలుస్తోంది. దానం నాగేందర్, బాజిరెడ్డి గోవర్దన్, వినయ్ భాస్కర్, జోగు రామన్న, గంగుల కమలాకర్, నన్నపనేని నరేందర్, సత్యవతి రాథోడ్, హరిప్రియ నాయక్, సబితా రెడ్డి, అజయ్ కుమార్, మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధీ, రేగ కాంతిరావు తదితరులు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. సామాజిక వర్గాలు, మహిళా కోటాలో వీరిలో ఎవరికి కేబినేట్ బెర్త్ దక్కుతుంది అనేది చూడాలి. ఐతే, బావబామ్మర్థి హరీష్ రావు, కేటీఆర్ ఒకేసారి కేబినేట్ లోకి రాబోతుండటం విశేషంగా చెప్పుకోవాలి.