‘అజ్ఝాతవాసి’పై డౌటు కొడుతోంది !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఝాతవాసి’గా రాబోతున్నాడని ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పవన్ కళ్యాణ్ 25వ సినిమా కోసం ‘అజ్ఝాతవాసి’ టైటిల్ దాదాపు ఫిక్సయిపోయినట్టేనని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. పవన్ ‘అజ్జాతవాసి’ అనే ముద్రపడిపోయింది. ఇలాంటి సమయంలో సడెన్’గా నవంబర్ 27న పవన్ సినిమా టైటిల్ ప్రకటిస్తామని చిత్రబృందం నుంచి ప్రకటన రావడంతో.. అసలు ‘అజ్ఝాతవాసి’ పవన్ టైటిల్ యేనా అనే డౌటు కొడుతోంది.

‘అజ్ఝాతవాసి’ కంటే ముందే పవన్ సినిమా కోసం ఇంజనీరు బాబు, పరదేశీ ప్రయాణం, గోకుల కృష్ణుడు.. టైటిల్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో.. ఈ నెల 27న ‘అజ్ఝాతవాసి’నే పవన్ టైటిల్ గా ప్రకటిస్తారా ? లేదంటే.. ఇంకేదైనా కొత్త టైటిల్ ని ప్రకటించి షాక్ ఇస్తారా ? అనే కన్ఫూజన్ పవన్ అభిమానుల్లో నెలకొంది. అయితే, ‘అజ్ఝాతవాసి’ టైటిల్ నే అఫిషియల్ గా ప్రకటిస్తారని కొందరు అభిమానులు స్పష్టంగా చెబుతున్నారు. మరీ.. పవన్-త్రివిక్రమ్ ఏం చేస్తారన్నది చూడాలి.

ఇప్పటికే పవన్ సినిమా హైదరాబాద్, యూరప్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొంది. త్వరలో వారణాసి షెడ్యూల్ మొదలవ్వనుంది. ఆ తర్వాత అలహాబాద్ షెడ్యూల్ ఉండనుంది. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ జతకట్టనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్. రాథా కృష్ణ నిర్మాత. ఈ సినిమాని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.