కేటీఆర్ కోసం ఈటెలకు చెక్ ?
కేటీఆర్ కోసం హరీష్ రావుని బలి చేశారు. చేస్తున్నారనే టాక్ తెలంగాణలో ఉంది. భవిష్యత్ లో కేటీఆర్ కు హరీష్ అడ్డురాకుండా సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే రెండో హరీష్ రావుకి మంత్రివర్గంలో చోటుదక్కలేదనే ప్రచారం జరుగుతోంది. ఇక త్వరలో చేపట్టనున్న కేబినేట్ విస్తరణలో హరీష్ రావుకి చోటు దక్కడంపై స్పష్టతలేదని తెలుస్తోంది. కేటీఆర్, గుత్తా సుఖేందర్ రెడ్డిలకి మాత్రం మంత్రి పదవులు ఖాయమని చెప్పుకొంటున్నారు. మరోవైపు, మంత్రి ఈటలను మంత్రివర్గం నుండి తప్పిస్తారనే ప్రచారంపై కూడ జరుగుతోంది. కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయడంలో భాగంగా కేసీఆర్ తీసుకోనున్నవ్యూహత్మకంగా అడుగుగా చెబుతున్నారు.
ఇదే నిజమైతే కేటీఆర్ కోసం ఈటెలని బలి చేసినట్టే అవుతోంది. ఇప్పటికే హరీష్ రావు విషయంలో సీఎం కేసీఆర్ వ్యవహార శైలిని తెరాస శ్రేణులు తప్పుబడుతున్నాయ్. బాహాటంగా అనకపోయినా.. నిజంగానే హరీష్ కి పార్టీలో అన్యాయం జరుగుతుందనే భావన వారిలో ఉంది. ఇప్పుడు హరీష్ మాదిరిగా ఈటెలని పక్కనపెడితే.. అది తెరాసలో ముసలం రేపవచ్చని చెబుతున్నారు. అదే జరిగితే కేటీఆర్ ఎదుగుదలకి అది ప్రతిబంధకం కావొచ్చు. మొత్తానికి.. భవిష్యత్తులో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసినా కూడ రాజకీయంగా నష్టం వాటిల్లకుండా ఉండేందుకు వీలుగానే మంత్రివర్గ కూర్పు ఉంటుందనే అభిప్రాయాన్ని కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.