పిల్ల పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది !
‘పిల్ల జమీందార్’ పిల్ల హరిప్రియ త్వరలోనే పప్పన్నం పెట్టోబోతుంది. పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చక చకా జరిగిపోతున్నాయనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రచారంపై హరిప్రియ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ‘ప్రస్తుతం సినిమాలతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పట్లో పెళ్లి చేసుకొనే ఆలోచన లేదు’ అని ట్విట్టింది.
‘పెళ్లి ప్రచారంపై మరింత క్లారిటీ కూడా ఇచ్చింది. పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి కొడుకు కావాలి కదా. ఇప్పటి వరకు తనకి కావాల్సిన వ్యక్తి దొరకలేదు. తన జీవితంలోకి రాలేదు. ప్రస్తుతం సినిమాలే నా జీవితం. కాబోయేవాడికోసం వెతికేందుకు ఇది సరైనా సమయం అనుకొంటా’ అంటూ రాసుకొచ్చింది. గతంలో హరిప్రియ ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
ఇక, తకిట తకిట, పిల్ల జమిందార్, జైసింహా సినిమాలతో హరిప్రియ తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. ప్రస్తుతం కెయస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్నసినిమాలోనూ హరిప్రియ ఓ హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది.