ధోనీ హీరోగా బాలీవుడ్ సినిమా ?
టీమిండియా మాజీ సారధి, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్డ్మెంట్ కి కాలం దగ్గపడుతోంది. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్ టైంలో ధోని రిటైర్డ్మెంట్ పై హాట్ హాటుగా చర్చజరిగింది. వరల్డ్ కప్ తోనే ధోని కెరీర్ ముగుస్తుందనుకొన్నారు. కానీ ధోని మరికొంతకాలం క్రికెట్ ఆడాలని భావించారు. అయినా.. ధోని కెరీర్ ముగియడానికి మరెంతో సమయం లేదు. రిటైర్డ్మెంట్ తర్వాత ధోని ఆర్మీలోకి వెళ్లాలని నిర్ణయించుకొన్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే ధోని పలుమార్లు చెప్పాడు కూడా.
మరోవైపు, ధోని సినిమాల్లోకి రాబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఐతే హీరోగా మాత్రం కాదు. నిర్మాతగా మారనున్నాడట. బాలీవుడ్ లో తన చిరకాల మిత్రుడు జాన్ అబ్రహంతో కలిసి ధోని నిర్మాణ సంస్థని స్థాపించబోతున్నారు. ఆ బ్యానర్ లో వరుసగా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకొంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దీనిపై ధోని, జాన్ అబ్రహం చర్చించుకొన్నారట. బహుశా.. తన నిర్మాణ సంస్థలో రాబోయే సినిమాల్లో ధోని గెస్ట్ రోల్ లో కనిపించొచ్చు.