‘సాహో’కు కులం మరక.. !
ప్రభాస్ అభిమానులు క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నారని అంటున్నారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’. శ్రద్దాకపూర్ కథానాయిక. సుజీత్ దర్శకత్వం వహించారు. దాదాపు రూ. 350కోట్ల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ బాషల్లో రేపు (ఆగస్టు30) సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో సాహో సెలబ్రేషన్స్ ఎప్పుడో మొదలైపోయాయ్. థియేటర్స్ అనీ సాహో బ్యానర్స్, ప్రభాస్ కటౌట్స్ తో నిండిపోయాయ్. ఇక ప్రభాస్ సొంతూరు భీమవరంలో సాహో ఫీవర్ మాములుగా లేదు. రెండుకు రెండు వైపుల సాహో పోస్టర్స్ వెలిశాయి. ఈ విషయంపైనే రాంగోపాల్ వర్మ తనదైన స్టయిల్ లో ట్విట్ చేశారు. భీమవరంలో రాజుల క్యాస్ట్ ఫీలింగ్ కనిపిస్తుందని కామెంట్ చేశారు. ఈ ట్విట్ పై కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సాహో సినిమాకు కులం మరక అవసరమా ? అంటున్నారు.
Rajulu’s CASTE FEELING on PRABHAS RAJU on Bhimavaram Roads 💐💐💐💃💃💃😍 pic.twitter.com/2Uw269xgJU
— Ram Gopal Varma (@RGVzoomin) August 29, 2019