సాహో రిలీజ్ : ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చూశారా ?

సాహో రిలీజ్ నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్, డై హార్ట్ ఫ్యాన్స్ పండగ చేసుకొంటున్నారు. థియేటర్స్ అన్నింటిని సాహో పోస్టర్స్, ప్రభాస్ కటౌట్స్ తో ముస్తాబు చేశారు. కొన్ని థియేటర్స్ వద్ద ఏర్పాటు చేసిన ప్రభాస్ భారీ కటౌట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. థియేటర్స్ కి వెళ్లే దారులకి ఇరువైపులా.. ప్రభాస్ కటౌట్స్ వెలిశాయి. ఓ పండగవాతావరణాన్ని తలపిస్తున్నాయి.

ఇక సాహో బినిఫిట్ షోలో ప్రభాస్ చేసిన హంగమా అంతా ఇంతా కాదు. థియేటర్స్ దద్దరిల్లిపోయాయ్. ఆ సెలబ్రేషన్స్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సాహోపై మిక్సిడ్ టాక్ వినిపిస్తోంది. సినిమాలో యాక్షన్స్ సీన్స్ హైలైట్ గా ఉన్నాయి. హాలీవుడ్ సినిమాని తలపిస్తున్నాయ్. ఐతే, అవి ప్రేక్షకుడుకి కనెక్ట్ అయ్యే ఎమోషన్ మిస్ అయిందని చెబుతున్నారు. ప్రీ ఇంటర్వెల్ ఏపీసోడ్, నేపథ్య సంగీతం, బ్యాడ్ బోయ్ సాంగ్ సినిమాకి ప్రధానబలంగా నిలిచాయని టాక్.