‘సాహో’ అమెరికా కలెక్షన్స్.. !


సాహో వచ్చేస్తోంది. ఇక నాన్ బాహుబలి అనే పదం వినిపించదనే అనే కామెంట్స్ వినిపించాయి. టీజర్, ట్రైలర్ చూస్తే సాహోకు ఆ రేంజ్ ఉంది అనిపించింది. ఐతే, ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సాహో’ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా అమెరికా ప్రీమియర్‌లో 9,15,224 డాలర్లు వసూలు చేసిందని, అమెరికాలో ప్రీమియర్‌ వసూళ్ల పరంగా ‘సాహో’ ఆరో స్థానంలో నిలిచినట్లు విశ్లేషకులు తెలిపారు.

అమెరికా ప్రీమియర్‌ వసూళ్లలో ‘బాహుబలి 2’ 2.4 మిలియన్‌ డాలర్లు రాబట్టి మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ‘అజ్ఞాతవాసి’ 1.52 మిలియన్‌ డాలర్లు, ‘బాహుబలి’ 1.39 మిలియన్‌ డాలర్లు, ‘ఖైదీ నంబర్‌ 150’ 1.29 మిలియన్‌ డాలర్లు, ‘స్పైడర్‌’ 1.00 మిలియన్‌ డాలర్లు రాబట్టగా.. ‘సాహో’ 915 వేల డాలర్లతో ఆరో స్థానంలో నిలిచింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ నటించిన సినిమా ఇది. సుజీత్‌ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది.