బాలీవుడ్ లోనూ ‘సాహో’కు నిరాశ !
‘సాహో’ ప్లాప్ టాక్ ని ప్రభాస్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ‘సాహో’ సూపర్. హాలీవుడ్ రేంజ్ సినిమా. తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు అంతే. బాలీవుడ్ జనాలకి సాహో బాగానే ఎక్కిందని చెప్పుకొంటున్నారు. ఇలా చెప్పుకొంటున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్. బాలీవుడ్ లోనూ సాహో తేలిపోయింది. అక్కడ తొలిరోజు సాహో రూ. 50కోట్లు రాబడుతుందని అందరు ఆశించారు. కానీ, పాతిక కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. సాహో చిత్రం భరించలేని సినిమా అని బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్విట్ చేశారు.
“అద్భుతమైన టాలెంట్, భారీ బడ్జెట్, మంచి అవకాశం వేస్ట్ అయింది. వీక్ స్టోరీ, కన్పూజన్ స్క్రెన్ ప్లే, వీక్ డైరెక్షన్’ అంటూ ట్విట్ చేశారు తరణ్ ఆదర్శ్. ఐతే, ప్రభాస్ స్టార్డమ్తో పాటుగా చిత్రానికి లభించిన హైప్, అడ్వాన్స్ బుక్సింగ్స్ వలన తొలి రోజు సాహో బాక్సాఫీస్ దగ్గర రూ. 24.40 కోట్ల వసూళ్ళు సాధించిందని తరణ్ పేర్కొన్నారు. 2,3 రోజులు చిత్రానికి చాలా కీలకమన్నారు.
ఈ సందర్భంగా 2019 విడుదలై తొలిరోజు కలెక్షన్స్ లో టాప్-5లో ఉన్న చిత్రాల వివరాలని తరణ్ ట్విట్ చేశారు. ‘భారత్’ చిత్రం తొలి రోజు రూ. 42.30 కోట్లు సాధించి టాప్లో నిలిచింది. ఆ తర్వాత ‘మిషన్ మంగళ్’ ఫస్ట్ డే రూ. 29.16 కోట్లు, సాహో రూ. 24.40 కోట్లు, కళంక్ రూ. 21.60 కోట్లు, కేసరి రూ. 21.06 కోట్లు సాధించి 2,3,4,5 స్థానాలలో నిలిచాయని తరణ్ ట్విట్ చేశారు.
#Saaho has a superb Day 1… Prabhas’ superstardom post #Baahubali2 + hype surrounding the biggie + excellent advance bookings ensured fantastic numbers… Day 2 and 3 biz crucial to pack a solid weekend total… Fri ₹ 24.40 cr Nett BOC. India biz. #Hindi version.
— taran adarsh (@taran_adarsh) August 31, 2019
Top 5 *Day 1* biz… 2019 releases…
1. #Bharat ₹ 42.30 cr [Wed]
2. #MissionMangal ₹ 29.16 cr [Thu]
3. #Saaho [#Hindi] ₹ 24.40 cr [Fri]
4. #Kalank ₹ 21.60 cr [Wed]
5. #Kesari ₹ 21.06 cr [Thu]
Nett BOC. India biz. #Hindi films only.— taran adarsh (@taran_adarsh) August 31, 2019
#OneWordReview…#Saaho: UNBEARABLE.
Rating: ⭐️½
A colossal waste of talent, big money and opportunity… Weak story, confusing screenplay and amateur direction. 👎👎👎#SaahoReview pic.twitter.com/Ogx1jkVuoE— taran adarsh (@taran_adarsh) August 30, 2019