‘అల.. వైకుంఠపురంలో’ ఫస్ట్ పోస్టర్ చూశారా ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. పూజా హెగ్డే కథానాయిక. థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక & హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సినిమాని ప్రేక్షకుల ముందుకు రానున్నారు.తాజాగా ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

ఇందులో బన్నీ స్టయిలీష్ లుక్ లో కనిపిస్తున్నారు. ఫారిన్ లొకేషన్ కాస్టీ కారు పక్కన చిన్న కంటె స్టూలు మీద కూర్చున్న బన్నీకి సెక్యూరిటీ గార్డ్ సిగరేట్ అంటిస్తున్న స్టిల్ అది. ఈ పోస్టర్ అదిరిపోయింది. కానీ, కన్ఫూజన్ లో పడేసింది. ఎందుకంటే ? టైటిల్ టీజర్ లో బన్నీ పల్లెటూరి బుల్లోడుగా కనిపించాడు. తాజా పోస్టర్ లో మాత్రం ఎన్నారైని మించిపోయిన లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ రెండింటికి సింక్ కావడం లేదు.. వాటిని త్రివిక్రమ్ తెలివిగా తెరపై ఏ విధంగా చూపిస్తాడన్నది చూడాలి. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. యంగ్ హీరోలు నవదీప్, సుశాంత్ లు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదీకూడా సన్నాఫ్ సత్యమూర్తి తరహా ఫాదర్ సెంటిమెంట్ ఉన్న కథతో తెరకెక్కుతోన్న సినిమా అని చెబుతున్నారు.