యంగ్ హీరో శాడిజం చూపిస్తున్నాడట !


‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరో కార్తీకేయ శాడిజం చూపిస్తున్నాడట. కార్తీకేయ నటించిన తొలి సినిమా ‘ప్రేమతో మీ కార్తీక్‌’ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత అజయ్‌ భూపతి ‘ఆర్‌ఎక్స్‌ 100’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నాడు. తర్వాత వచ్చిన ‘హిప్పీ’ అంతగా ఆడలేదు. ‘గుణ 369’తో మాస్ ప్రేక్షకులని ఆకట్టుకొన్నాడు. హీరోగా మూడు సినిమాలు మాత్రమే చేసిన కార్తీకేయ విలన్ గా టర్న్ తీసుకొన్న సంగతి తెలిసిందే. నాని ‘గ్యాంగ్ లీడర్’లో విలన్ గా నటిస్తున్నాడు. అప్పుడే విలన్ గా ఎందుకు ? అంటే ఆసక్తికర సమాధానం చెప్పాడు.

“నానీ ‘గ్యాంగ్‌లీడర్‌’లో నా పాత్ర విన్నాక ఛాలెంజింగ్‌గా అనిపించింది. హీరోగా కొన్ని ఎమోషన్స్‌ మాత్రమే పలికించగలం. ఉదాహరణకు శాడిజాన్ని హీరో పాత్ర చూపించలేదు. అందుకే ఈ సినిమా చేయడానికి సిద్ధమయ్యాను. నటుడిగా నాలోని మరో కోణం చూస్తారు ఇందులో” అన్నాడు కార్తీకేయ. నాని గ్యాంగ్ లీడర్ కు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.