రమ్యకృష్ణ విశ్వరూపం.. నాగ్ కు చెక్ పడినట్టే.. !

గెస్ట్ గా తీసుకొస్తే గేమ్ నే హాండ్ ఓవర్ చేసుకొనేలా ఉంది శివగామి. బిగ్ బాస్ 3 శనివారం ఏపీసోడ్ కి రమ్యకృష్ణ గెస్ట్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. నాగార్జున బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో ఫారిన్ టూర్ కి వెళ్లిన నేపథ్యంలో రమ్యకృష్ణని తీసుకొచ్చారు. శని, ఆదివారం కూడా రమ్యకృష్ణనే హోస్ట్ గా వ్యవహరిస్తారు. ఇక శనివారం ఏపీసోడ్ లో రమ్యకృష్ణ విశ్వరూపం చూపించింది. తనదైన శైలిలో షోని డీల్ చేశారు. సీజన్ 1 హోస్ట్ గా వ్యవహరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తలపించారు.

చాలా స్ట్రిక్ట్ గా షోని నడిపించారు. అతిగా మాట్లాడే ఇంటిసభ్యుల మాటలకి కట్ చెప్పేసి.. ముందుకు నడిపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే నాగ్ కంటే బెటర్ గా షోని డీల్ చేశారు. దీంతో శివగామిగా బుల్లితెరపై నట విశ్వరూపం చూపించిందిని బిగ్ బాస్ అభిమానులు చెప్పుకొంటున్నారు. బహుశా.. బిగ్ బాస్ సీజన్ 4కి హోస్ట్ ని వెతికాల్సిన పనిలేదేమో.. !

ఇక, ఈవారంతో బిగ్ బాస్ 3 విజయవంతంగా ఆరువారాలని పూర్తి చేసుకోనుంది. తొలివారం బిగ్ బాస్ 3 నుంచి హేమ, రెండోవారం జాఫర్, మూడోవారం తమన్నా, నాల్గోవారం రోహిణి, ఐదోవారం ఆషూరెడ్డి ఎలిమినేట్ అయ్యారు. ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు ? అన్నది ఆసక్తిగా మారింది.