గ్యాంగ్ లీడర్ : ‘నిను చూసే ఆనందంలో.. ‘ లిరికల్ సాంగ్

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. వినాయకచవితి సందర్భంగా ఈ సినిమా నుంచి “నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే.. ” అంటూ సాగే లిరికల్ సాంగ్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటని అనంత శ్రీరామ్ రాశారు. సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. సాంగ్ చాలా బాగా ఉంది. సాంగ్ మొదలవ్వడానికి ముందే వచ్చే రొమాంటిక్ సీన్ ఇంకా బాగుంది.

‘రైటర్ ను అయి ఉండి, నాకే చెప్పటానికి మాటలు రావడం లేదు. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు. తెలుసా? క్రైమ్’ అని నాని హీరోయిన్ తో అనడం.. దగ్గరికి రా అంటూ హీరోయిన్ ఊరించడం ఆకట్టుకొంది. నాని గ్యాంగ్ లీడర్ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.