ఇల్లీకి మెగా ఆఫర్. కానీ.. !

గోవా బ్యూటీ ఇలియానా మెగా ఆఫర్ దక్కిందా ? ఇందుకోసం ఆమె బాగా కష్టపడుతుందా ?? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మెగాస్టార్ చిరంజీవి 151 ‘సైరా’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా ఉండనుంది. ఈ సినిమా కోసం హీరోయిన్స్ గా నయనతార, తమన్నా, అనుష్క పేర్లు వినిపించాయ్. ఐతే వీరిలో ఎవరు ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ 152 కోసం ఇలియానా ప్రయత్నాలు చేస్తోందట.

ఇటీవల తన మేనేజర్ ని దర్శకుడు కొరటాల శివ దగ్గరికి పంపిందట. రెమ్యూనరేషన్ విషయంలో పెద్దగా పట్టింపులు లేవు. మెగాస్టార్ సరసన హీరోయిన్ గా ఆఫర్ ఇస్తే చాలని కబురుపంపిందట. కొరటాల కూడా ఇలియానాని తీసుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. కాకపోతే.. బరువు తగ్గాలని సూచించాడట. ఈ నేపథ్యంలో ఇల్లీ ప్రస్తుతం బరువు తగ్గే పనిని మొదలెట్టినట్టు తెలుస్తోంది. వ్యాయామం, డైటింగ్ తో భారీగా సైజులు తగ్గించాలని ప్రయత్నిస్తోంది. ఇల్లీ సన్నబడితే మెగా ఆఫర్ కొట్టేసినట్టే. లేదంటే.. ఆ ఆఫర్ మరొకరికి దక్కవచ్చు.

ఇక ఇలియానా పేరిట తెలుగులో తొలిసారి కోటి రూపాయల పారితోషికం అందుకొన్న కథానాయికగా రికార్డ్ ఉంది. రామ్ ‘దేవదాస్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ‘పోకిరి’ హిట్ తో స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరింది. అప్పట్లోనే మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ.. లతో ఆడిపాడింది. ఇక్కడ మంచి ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ మంచి నటి అనిపించుకొన్నా.. బిజీ హీరోయిన్ కాలేకపోయింది. రవితేజ ‘అమర్ అక్భర్ ఆంథోని’ సినిమాతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ప్లాప్ కావడంతో తెలుగులో మరో అవకాశం రాలేదు. మరోవైపు ఆస్ట్రేలియా బోయ్ ఫ్రెండ్ ఆండ్రూకు ఇల్లీకి బ్రేకప్ చెప్పేసినట్టు సమాచారమ్. ఈ నేపథ్యంలో హీరోయిన్ గా మళ్లీ బిజీకావాలని, మెగాస్టార్ సినిమాలో ఆఫర్ దక్కించుకుంటే అది మరింత సులువు అవుతుందని ఇల్లీ ఆలోచనగా కనిపిస్తోంది. మరీ.. మెగాస్టార్ 152లో ఇల్లీకి ఛాన్స్ దొరుకుతుందేమో చూడాలి.