విజయ్ బాలీవుడ్ సినిమా లాంఛ్.. ముహూర్తం ఫిక్స్ !

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో బాలీవుడ్ దృష్టిలో పడ్దాడు విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’ బాలీవుడ్ రిమేక్ ‘కబీర్ సింగ్’లోనూ విజయ్ నే నటించాల్సి ఉంది. కానీ కొత్త కథతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలన్నది విజయ్ దేవరకొండ ఆలోచన. విజయ్ ని బాలీవుడ్ పరిచయం చేసే బాధ్యతని ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తీసుకొన్నారు. ఇప్పటికే విజయ్ బాలీవుడ్ సినిమా ఫిక్సయింది. ఈ నెల 6న సినిమాని అధికారికంగా ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. కరణ్-సిద్దార్థ్ రాయ్-సాజిద్ సంయుక్తంగా విజయ్ సినిమా నిర్మిస్తారని టాక్.

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్ క్రేజ్ స్టార్ గా మారాడు విజయ్ దేవరకొండ. స్టార్ హీరోలని మించిన క్రేజ్ ని సొంతం చేసుకొన్నాడు. నోటా, డియర్ కామ్రేడ్ సినిమాలతో దక్షిణాదిలోని అన్నీ బాషల ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ఐతే, భారీ ఆశలు, అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన డియర్ కామ్రేడ్ తీవ్రంగా నిరాశపరిచింది. స్టోరీ లైన్ బాగున్నా.. నివిడి ఎక్కువ అవ్వడం వలనే సినిమా దెబ్బతిన్నది చెప్పవచ్చు. డియర్ కామ్రేడ్ ని బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు కరణ్ జోహార్.