వైకుంఠపురంలో బన్నీ క్లాసా.. మాసా ?


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టయిలీష్ స్టార్ అభిమానులని కన్ఫూజన్ లో పెట్టేశాడు. త్రివిక్రమ్-బన్నీ కాంబోలో హ్యాట్రిక్ చిత్రంగా ‘అల.. వైకుంఠపురంలో’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ టీజర్ లో బన్నీ పల్లెటూరు కుర్రాడిలా, దసరాబుల్లోడిగా కనిపించాడు. దీంతో ఇది గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా. బంధాలు-బాంధవ్యాలని బలంగా చూపించబోతున్నాడు. ఫాదర్ సెంటిమెంట్ తో సినిమా రాబోతుందనే ప్రచారం జరిగింది. ఐతే, ఇటీవల త్రివిక్రమ్ బన్నీ ఫ్యాన్స్ కు సడెన్ సప్రైజ్ చేశారు. ఫారిన్ లో లొకేషన్స్ లో బన్నీ స్టయిలీష్ లుక్ లో ఉన్న పోస్టర్ ని వదిలాడు.

ఈ నేపథ్యంలో వైకుంఠపురంలో బన్నీ క్లాసా ? మాసా.. ? అనే చర్చ జరుగుతోంది. బన్నీ పాత్రను త్రివిక్రమ్ ‘రౌడీ అల్లుడు’ మూవీలో చిరంజీవి పాత్రలా రెండు డిఫరెంట్ షేడ్స్ లో డిజైన్ చేసి ఉంటాడేమో అనే ప్రచారం జరుగుతోంది. టీజర్, ట్రైలర్ వస్తే గానీ వైకుంఠపురంలో బన్నీ పాత్రలో క్లారిటీ వచ్చేలా లేదు. ఇందుకోసం బన్నీ ఫ్యాన్స్ కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.

ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. యంగ్ హీరోలు నవదీప్, సుశాంత్ లకి సినిమాలో మంచి పాత్రలు దక్కాయని చెబుతున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక & హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.