ప్రధాని డైరీలో ఆ తొమ్మిది గంటలు.. ?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. నిన్న మొన్నటి వరకు ప్రధాని పర్యటన డైలామా ఉన్న అధికారులకు , రాష్ట్ర ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చింది. మెట్రో రైలును ప్రధానిచే ప్రారంభించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని ఎప్పుడు టైం ఇస్తారా అని ఆలోచనలో పడింది. ఇప్పుడు ప్రదాని కార్యాలయం నుంచి రాష్ట్ర పర్యటనపై షెడ్యూల్ విడుదల కావడంతో మెట్రో ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు.
ఈ నెల 28న మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రధాని ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాఫ్టర్‌లో 2.05 గంటలకు మియాపూర్ హెలిప్యాడ్ కు.. అటునుంచచి రోడ్డు మార్గంలో కార్యక్రమ వేదిక వద్దకు చేరుకుంటారు. 2.15 నుంచి 2.23 వరకు మెట్రో పైలాన్‌ను ఆవిష్కరించి.. హైదరాబాద్ మెట్రోను జాతికి అంకితం చేస్తారు. మెట్రో రైలు బ్రోచర్, ప్రయాణికులకు అనువుగా రూపొందించిన యాప్ ను విడుదల చేస్తారు.
మధ్యాహ్నం 2.30 నుంచి 2.40 వరకు మియాపూర్ నుంచి కూకట్ పల్లి చేరుకుంటారు. తరువాత మియాపూర్ వరకు మెట్రో రైలులో ప్రయాణం చేస్తారు. 2.55కు మియాపూర్ నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరి 3.15కు హెచ్ఐసీసీ చేరుకుంటారు. 3.25కు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు వేడుక వద్దకు చేరుకుంటారు. 3.25 నుంచి 7.25 వరకు సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. 7.30కి రోడ్డు మార్గంలో బయలుదేరి 8 గంటలకు తాజ్ ఫలక్ నూమా ప్యాలెస్ కు చేరుకుంటారు. 8 గంటల నుంచి 10 గంటల వరకు అక్కడ విందులో పాల్గొంటారు. 10.05 గంటలకు అక్కడినుంచి రోడ్డు మార్గంలో 10.25కు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.