తమ్ముడి ప్రేమకు నెటిజన్స్ ఫిదా !


బాలీవుడ్ యంగ్ హీరో హర్షవర్థన్ కపూర్ ఇద్దరు సోదరిమణులు సోనమ్ కపూర్, రియా కపూర్ లపై అమితమైన ప్రేమ చూపించారు. అనిల్ కపూర్ కి ముగ్గురు సంతానం. వీరిలో సోనమ్ కపూర్ ష్యాషన్ ఐకాన్ అనిపించుకొంది. హీరోయిన్‌గా రాణిస్తోంది. మరో అమ్మాయి రియా కపూర్ నిర్మాతగా రాణిస్తున్నారు. ఇక అనిల్ కపూర్ ఏకైక కుమారుడు హర్షవర్థన్ కపూర్ హీరోగా నిలదొక్కుకొనే ప్రయత్నంలో ఉన్నారు. తాజాగా హర్షవర్థన్.. తన అక్కలు సోనమ్, రియా పేర్లను ఒక్కో భుజంపై పచ్చబొట్టుతో వేయించుకున్నాడు.

కుడి భుజంపై సోనమ్, ఎడవ భుజంపై రియా పేర్లను పచ్చబొట్టుగా వేయించుకొన్నాడు. దానికి సంబంధించిన ఫోటోని హర్షవర్థన్ తన ఇన్ స్ట్రోగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు హర్షవర్దన్‌‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ‘నీ సోదరీమణులపై నీ ప్రేమ అద్భుతం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం హర్షవర్ధన్ కపూర్ అభినవ్ బింద్రా బయోపిక్‌లో నటిస్తున్నారు.

View this post on Instagram

V taper #mondaymotivation @sonamkapoor @rheakapoor

A post shared by Harsh Varrdhan Kapoor (@harshvarrdhankapoor) on