ఏపీ కేబినేట్ భేటీ హైలైట్స్
ఏపీ క్యాబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం, కొత్త ఇసుక విధానం సహా పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మొత్తం 38 అంశాల అజెండాతో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఏపీ మంత్రివర్గం తీసుకొన్న మరిన్ని కీలక నిర్ణయాలు ఏటంటే.. ?
* ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అంగీకారం
* ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం
* కొత్త ఇసుక విధానం రేపటి నుంచి అమల్లోకి
* ఇసుక ధరను టన్ను ధర రూ.375
* తొలి దశలో 58 ఇసుక స్టాక్ పాయింట్లు
* ఏపీఎండీపీ ద్వారా ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేసుకోవచ్చు
* దశల వారీగా ఇసుక రీచ్ లు, స్టాక్ పాయింట్లు పెంపు
* నవయుగ సంస్థకు పోలవరం హైడ్రల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు నిర్ణయానికి ఆమోదం
* రివర్స్ టెండరింగ్ పద్ధతిలో తాజా టెండర్లకు పచ్చజెండా
* కాంట్రాక్టర్ కు ఇచ్చిన అడ్వాన్స్ ల రికవరీకి మంత్రి వర్గం ఆమోదం
* ఆశావర్కర్ల వేతనం పెంపునకు ఆమోదం
* ఆశావర్కర్ల వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు
* మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్ కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కుతీసుకోవాలన్న నిర్ణయం
* పనులు ప్రారంభించకపోవడంతో ఈ నిర్ణయం
* మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు