వారి పేర్లు బయటపెడితే.. సినిమా ఆఫర్లు పోతాయ్ !
కన్నుగీటేసి.. రాత్రికి రాత్రే స్టార్ డమ్ సొంతం చేసుకొంది మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. ‘ఒరు ఆడార్ లవ్’ సినిమాలో ఓ చిన్న బీట్ సీన్ అది. చాలా పాపులర్ అయ్యింది. సినిమాపై అంచనాలని పెంచేసింది. ఒక్కసారి కన్ను గీటేస్తేనే యూత్ తల్లడిల్లిపోయింది. ఇక సినిమాలో ప్రియా మాయ చేయడం ఖాయమని భావించారు. ఐతే, ‘ఒరు ఆడార్ లవ్’ (లవర్స్ డే – తెలుగులో)
అంచనాలని అందుకోలేదు. ప్రియా నటనపై విమర్శలొచ్చాయ్. అందం, అభినయంలోనూ ఆమెకు అత్తెసర మార్కులే పడ్డాయి. ఐతే, అప్పటికే ఆమె వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. బాలీవుడ్ లో ‘శ్రీదేవి బంగ్లా’ సినిమాలో నటిస్తోంది.
తెలుగులో నితిన్ ‘రంగ్ దే’లో నటిస్తోంది. అదే సమయంలో కన్నడలోనూ ఎంట్రీ ఇవ్వబోతుంది ప్రియా. అక్కడ ‘విష్ణుప్రియ’ అనే సినిమా చేస్తోంది. ఈ నేపథ్యంలో మీడియా ప్రియాని ఓ ప్రశ్న అడిగేసింది. సూపర్‌స్టార్ యశ్‌తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారా ? అని ప్రశ్నించింది. దానికి ప్రియా చెప్పిన సమాధానం గమ్మత్తుగా ఉంది. ఇంతకీ ప్రియా ఏం చెప్పిందంటే ?
‘నేను ఈ ప్రశ్నకు ఇంతకుముందు కూడా సమాధానమిచ్చాను. నేను ఎవ్వరి పేర్లు బయటికి చెప్పాలని అనుకోవడం లేదు. ఎందుకంటే కేవలం ఫలానా హీరోతో మాత్రమే సినిమా చేయాలని ఉందని చెబితే నా చేతిలో ఉన్న మిగతా సినిమాలు పోతాయి. నేను అందరితో కలిసి పనిచేయాలని అనుకుంటున్నా”నంది. ప్రియా సమాధానం వింటే పడకగది పిలుపులపై స్పందనలా ఉంది.
ఇక ‘తనని నన్ను కేవలం వింక్ గర్ల్ అని పిలకవకండీ. అలా పిలిపించుకోవడం తనకి ఏమాత్రం ఇష్టం లేదు. నా ఫీలింగ్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడానికి నా కళ్లే కీలక పాత్ర పోషిస్తాయి. కన్ను కొట్టడంతో పాటు ఈ సినిమాలో విభిన్నంగా ఏదన్నా ప్రయత్నించాలని అనుకుంటున్నా’నని చెప్పుకొచ్చింది. ఈసారి కన్నుకొట్టడం మానేసి.. ఇంకేం చేస్తుందో చూడాలి.