నటి ఆరోపణలపై బన్నీవాసు స్పందన
జనసేన మహిళా కార్యకర్త, నటి సునీత బోయ జనసేన పార్టీ, నిర్మాత బన్నీవాసుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ కోసం పనిచేస్తే ఆదుకుంటామని జనసేన చెప్పింది. ఇప్పుడే మోపట్టించుకోవడం లేదు. ఇక బన్నీవాసు తనకి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడని ఆరోపణలు చేసింది. మంగళవారం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ ఛాంబర్ లో తనని తని తాడులతో బంధించుకొని నిరసన తెలిపింది. ఆ తర్వాత ఆమెని పోలీసులు అదుపులోనికి తీసుకొని.. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
ఈ వ్యవహారంపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఓ వీడియో బైట్ ని విడుదల చేశారు. ఇందులో బన్నీ వాసు ఏం చెప్పాడంటే.. ? ‘సునీత బోయ జనసేనలో పని చేశారు. తనకు సినిమాల్లో ఏవైనా అవకాశాలు ఉంటే ఇప్పించాలని తనను సంప్రదించిన మాట వాస్తవమే. దీంతో తనకు తెలిసిన వారికి ఆమె వివరాలు చెప్పి అవకాశాలు ఉంటే చెప్పాను. సినిమాల్లోకి రావాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆడిషన్స్ లో పాల్గొని ఎంపికవ్వాలి. ఆడిషన్స్ పాస్ అయితే కచ్చితంగా తీసుకుంటారు. సునీత బోయ ప్రవర్తన కారణంగా ఆమెకి పాత్రలు రాలేదు. తప్ప ఇతర కారణాలు లేవు” అని బన్నీ వాసు అన్నారు.