‘అల.. వైకుంఠపురంలో’ టీజర్ ముహూర్తం ఫిక్స్ !

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఆకలితో ఉన్నారు. ‘నా పేరు సూర్య’ తర్వాత బన్నీ లాంగ్ గ్యాప్ తీసుకొన్నా.. ఓపికగా వెయిట్ చేశారు. ఐతే, త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ తాజా చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా కోసం ఆగలేకపోతున్నారు. అభిమానుల బాధని అర్థం చేసుకొన్న బన్నీ కూడా సినిమా రిలీజ్ డేటుని ఇప్పటికే ప్రకటించేశారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈలోగా సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ని వదులుతున్నారు.

వినాయక చవితి కానుకగా అభిమానులని సప్రైజ్ చేశాడు బన్నీ. స్టయిలీష్ పోస్టర్ ని వదిలారు. ఇక, టీజర్ కూడా ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారమ్. నవంబర్ 7న త్రివిక్రమ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అల.. వైకుంఠపురంలో టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు సమాచారమ్. ఈ చిత్రంలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటించింది. బాలీవు సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. నవదీప్, సుశాంత్, సముద్రఖని, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్-హారిక & హాసినీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.