డీజీపీ కారుకు జరిమానా


చట్టానికి ఎవరూ అతీతులు కాదనీ, అందరూ సమానులేనని తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు. రాంగ్ రూట్లో వెళ్లిన తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి కారుకి జరిమానా విధించారు. అలాగని ఈ క్రెడిట్ మొత్తం ట్రాఫిక్ పోలీసులది ఏం కాదు. ఓ సామాన్యుడిది. ఈ నెల 3న డీజీపీకి చెందిన కారు సంగారెడ్డిలో రాంగ్ రూట్ లో వెళ్తుండగా ఎవరో సామాన్యుడు ఫొటో తీసి సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆ వాహన వివరాలపై ఆరా తీయగా.. అది డీజీపీ మహేందర్ రెడ్డి కారని తేలింది. అయినా.. నిబంధనల విల్లఘించకుండా పోలీస్ బాస్ కు రూ.1,135 ల జరిమానా విధించారు. ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తద్వారా చట్టానికి చుట్టాలు లేరు. అందరు సమానులేనని నిరూపించారు. అన్నటు.. ఈ నెల నుంచి ట్రాఫిక్ రూల్స్ ని కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. రూల్స్ ని బ్రేక్ చేస్తే.. భారీ ఫైన్ తప్పదు.