రేవంత్ కు కేటీఆర్ బామ్మర్ది నోటీసులు..?
గత కొంత కాలంగా మంత్రి కేటీఆర్ బామ్మర్దిపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. డ్రగ్స్ కేసులో కేటీఆర్ బామ్మర్ది కీలక పాత్రధారి అంటూ టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఆరోపిస్తున్నారు రేవంత్. అందుకే డ్రగ్స్ కేసులో ప్రభుత్వం ముందు హడావుడి చేసి ఇప్పుడు కేసును నీరుగారుస్తుందంటూ విరుచుకుపడ్డారు. ఎన్ని ఆరోపణలు చేసినా అటువైపునుంచి స్పందన రాలేదు. స్పందించకపోతే ప్రభుత్వంపై తప్పుడు సంకేతాలు వెళతాయని భవించారో ఏమోగాని తాజాగా కేటీఆర్ బామ్మర్ది రాజేంద్ర ప్రసాద్ రేవంత్ పై కౌంటర్ అటాక్ చేశాడు.
రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీచేశారు కేటీఆర్ బామ్మర్ది రాజేంద్రప్రసాద్. తన వ్యాపారానికి సంబంధించి అసత్య ఆరోపణలు ఆరోపణలు చేయడంతో పాటు ప్రభుత్వ పెద్దల పరువుతీస్తున్నారని నోటీసుల్లో ఆరోపించారు. మీడియా సమక్షంలో వెంటనే క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని నోటీసుల్లో వెల్లడించారట. చూడాలి మరి ఈ నోటీసులపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో..