దినేశ్‌ కార్తీక్‌కు షోకాజ్‌నోటీసులు

టీమిండియా ఆటగాడు దినేష్ కార్తీక్ కు బీసీసీఐ సలైంట్ గా షాకిచ్చింది. షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఫస్ట్‌క్లాస్ బోర్డు కాంట్రాక్ట్‌ ఆటగాడు ఐపీఎల్‌లో కాకుండా ఇతర ప్రైవేటు లీగుల్లో ఆడటానికి వీళ్లేదు. ఈ నిబంధని అతిక్రమిస్తూ.. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ జట్టు ప్రమోషనల్‌ ఈవెంట్‌లో పాల్గొన్నాడు డీకే.

ఐపీఎల్‌లోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు, సీపీఎల్‌లోని ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ యజమాని. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కార్తీక్‌ సారథిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో సెయింట్‌ కిట్స్‌తో జరిగిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ తొలి మ్యాచ్‌కు కార్తీక్‌ హాజరయ్యాడు. ట్రిన్‌బాగో జట్టు జెర్సీ ధరించి డ్రెస్సింగ్‌ రూమ్‌లో కనిపించాడు. దీంతో.. ఆయనకి బీసీసీఐ షోకాజ్ నోటీసులు పంపింది. దీనిపై డీకే ఏం సమాధానం ఇస్తాడన్నది చూడాలి.

ఇక, ఇటీవల జరిగిన ప్రపంచకప్ దినేష్ కార్తీక్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. దాంతో నెం.4కు వరల్డ్ కప్ లో సమాధానం దొరకలేదు. ఆ ఎఫెక్ట్ టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పై పడిన సంగతి తెలిసిందే.