‘గ్యాంగ్ లీడర్’ గందరగోళంపై నాని క్లారిటీ

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని కథానాయకుడుగా నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ని ప్రారంభించాడు నాని. మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. గ్యాంగ్ లీడర్ కి సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘జెర్సీ’ షూటింగ్ సమయంలోనే విక్రమ్ కుమార్ కథ చెప్పారు. ఈ కథకి గ్యాంగ్ లీడర్ టైటిల్ సరిగ్గా సరిపోతుంది. ఐతే, టైటిల్ వస్తున్న కొన్ని వివాదాలు, అభ్యంతరాల దృష్ట్యా ‘నాని గ్యాంగ్ లీడర్’ టైటిల్ పెట్టామని తెలిపారు. ఇక ‘గ్యాంగ్ లీడర్’ ఏమాత్రం గందరగోళంగా ఉండదు. సింపుల్ స్టోరీ.

కీలక మలుపులు, ఊహించని ట్విస్ట్ లు ఉన్నా అవన్నీ అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. మిమ్మల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. ఇందులోనే పెన్సిల్ పార్థసారథి అనే రచయితగా కనిపిస్తానని తెలిపారు నాని. ఈ కథ కొత్తగా ఉంటుంది. రివేంజ్ స్టోరీని హాస్యంతో ఎవరూ ఇంతవరకూ తీయలేదు. విక్రమ్ తొలిసారి అలా తెరకెక్కించారు. విక్రమ్ కథ చెప్పినప్పుడు నేను ఎంత నవ్వానో.. థియేటర్ లో మీరు కూడా అంతే నవ్వితే సినిమా ఘన విజయం సాధించినట్లేనన్నారు.