మరో వరల్డ్ కప్ వరకు ధోని.. ! 


ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ ముందు, తర్వాత కూడా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ రిటైర్మెంట్ పై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఐతే, వరల్డ్ కప్ టీమిండియా వెళ్లిన విండీస్ టూర్ కి ధోని వెళ్లలేదు. ఆయన ఆర్మీ శిక్షణ కోసం రెండునెలలు సెలవు తీసుకొన్నారు. ఇక, త్వరలో ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా సిరీస్ కి ధోనిని ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న  టీ20 ప్రపంచకప్ వరకు ధోనీని ఉంచాలని భావిస్తే అతడిని మరిన్ని మ్యాచ్ లు ఆడించాలని కుంబ్లే సెలక్టర్లకు సూచించాడు. 

టీ20ల్లో ధోని ఆడించే ఉద్దేశంతో లేకుంటే ఆయనతో సెలక్టర్లు మాట్లాడాలని కుంబ్లే అన్నారు. రిటైర్మెంట్ తీసుకోవాలని ధోని భావిస్తే అతడికి గౌరవమైన, సముచితమైన వీడ్కోలు ఇవ్వాలని వెల్లడించాడు. ధోనీకి గౌరవమైన, సముచితమైన వీడ్కోలు ఇవ్వాలి. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా రిషభ్ పంత్ ఉండాలని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా టీ20ల్లో. కానీ, పంత్ ప్రదర్శన నిలకడగా లేదు. ఈ నేపథ్యంలో కొత్తవారికి పిలుపునిస్తారా లేదా పాత ఆటగాళ్లనే కొనసాగిస్తారా అనే విషయాన్ని సెలక్టర్లు తేల్చుకోవాలి అని అన్నాడు. ఇక టెస్టుల్లో రోహిత్ శర్మ, అశ్విన్ లని తీసుకోవాలని కుంబ్లే సూచించాడు. మొత్తానికి ధోని అంశాన్ని తేల్చాలని సెలక్టర్లకి కుంబ్లే సూచించినట్టు అనిపిస్తోంది. మరీ.. ధోని రిటైర్ట్మెంట్ వ్యవహరంపై సెలక్టర్లు ఎలా వ్యవహరిస్తారన్నది చూడాలి.