పెళ్లి తర్వాత స్పీడు పెంచాడేంటీ ?!

పెళ్లి తర్వాత అఖ్కినేని యంగ్ హీరో నాగ చైతన్య స్వీడు పెంచడంపై ఇండస్ట్రీలో రకరకాలుగా చెప్పుకొంటున్నారు. సాధారణంగా సినీ స్టార్స్ పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు షూటింగ్స్’కి దూరంగా ఉండటం, లేదంటే సినిమాలని తగ్గించుకోవడం చేస్తుంటారు. ఐతే, చైతూ మాత్రం పెళ్లి తర్వాత స్వీడు పెంచేశాడు. ఒకేసారి రెండు మూడు సినిమాలని సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. దీంతో పెళ్లి తర్వాత చైతూకి సమంత బూస్ట్ ఇచ్చినట్టుందని గుసగుసలు వినబడుతున్నాయి.

ఇటీవలే చందూమొండేటి దర్శకత్వంలో చైతూ హీరోగా తెరకెక్కుతోన్న ‘సవ్యసాచి’ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లి వారం తిరక్కముందే మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న చైతూ సినిమా ప్రారంభోత్సవం జరుపుకొంది. ఇదీగాక, దర్శకుడు అనిల్ రాఘవపూడి విక్టరీ వెంకటేష్’తో కలిసి ప్లాన్ చేసిన మల్టీస్టారర్ సినిమాలో చైతూ నటించనున్నాడని చెప్పుకొంటున్నారు.

మొత్తానికి సమంతతో పెళ్లి తర్వాత చైతూ స్వీడు పెంచాడు. సమంత కూడా సలైంట్ గా ఏమీ ఉండటం లేదు. ఆమె మూడ్నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. మరీ.. ఈ కొత్త జంట సంసారం చేసేదెప్పుడు ? అదేనండీ కాస్త ఫ్రీ-టైం దొరికేది ఎప్పుడు అని. దీనికోసం డిసెంబర్ లో లాంగ్ హనీమూన్ ట్రిప్ కి ప్లాన్ చేసుకొందట ఈ జంట. పక్కా ప్లాన్ తోనే ప్రస్తుతం సామ్-చై స్వీడు పెంచినట్టు కనబడుతోంది. ఇది తెలియని జనాలు రకరకాలు మాట్లాడుకొంటున్నారు.