కాజల్ రేటు.. మరీ ఇంత తక్కువా ?
టాలీవుడ్, కోలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ అనిపించుకొంది కాజల్. బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించింది. ఐతే, అవేవీ ఈమెకు పేరు తీసుకురాలేదు. కొన్నేళ్ల కిందటే ‘స్పెషల్ చబ్బీస్’ వంటి సినిమాను చేసినా.. ఆ సినిమా హిట్ అయినా.. కాజల్ కు మాత్రం అది పేరు తీసుకురాలేదు. దీంతో బాలీవుడ్ లో ఈమె తన దండయాత్రలను కొనసాగిస్తూ ఉంది. ఈ క్రమంలో చాలా తక్కువ పారితోషికం.. కేవలం రూ. 30లక్షలకి ఓ బాలీవుడ్ సినిమాని చేసేందుకు అంగీకరించింది.
ఇంత పారితోషికం కాజల్ ఎప్పుడూ తీసుకోలేదు. తెలుగు, తమిళ్ సినిమాల కోసం రూ. కోటిపైనే తీసుకుంటోంది. ఎంత తక్కువ తీసుకొన్న రూ. 70లక్షలకి తక్కవ ఛార్జ్ చేయలేదు. ఇప్పుడేమో బాలీవుడ్ సినిమా కోసం రూ. 30లక్షలకే ఓకే చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. బహుశా.. ఆ కథ కాజల్ ని బాగా నచ్చేసి ఉంటుంది. దీంతో పారితోషికం గురించే ఆలోచించకుండా.. ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులు తన గురించి మాట్లాకుంటే చాలని కాజల్ అనుకొంటున్నట్టు అనిపిస్తోంది. ఇక, టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్స్ కి గట్టిపోటీనిస్తోంది కాజల్. ఈ ఏజ్ లోనూ గ్లామర్ రోల్స్ కి మంచి ఆప్షన్ అనిపించుకుంటోంది.