నాని సినిమా ‘అ’ ఫస్ట్ లుక్


నాచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్’ని రిలీజ్ చేశారు. ‘అ’ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ‘ప్ర‌పంచంలోనే నేను, నాలోని ప్ర‌పంచం’ అంటూ ట్యాగ్ టైన్ పెట్టారు. ఈ చిత్రానికి ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. నాని నిర్మాత మారి చేసిన తొలిచిత్రమిది.

ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ ఓ పాత్రకి వాయిస్ ఓవర్ కోసం నాని దగ్గరకు రావడం. ఆ కథ విని, ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని కథ అని నాని ఫీలవ్వడంతో ఈ సినిమా నిర్మించేందుకు ఓకే చెప్పాడట. ఈ విషయాన్ని స్వయంగా నానినే తెలిపారు. ఇప్పటి వరకు నాని హీరోగా విభిన్నమైన సినిమాలతో అలరిస్తున్నారు. ఇకపై నిర్మాతగానూ ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించేందుకు నాని రెడీ అయినట్టు తెలుస్తోంది.