‘గ్యాంగ్ లీడర్’ సెన్సార్ రివ్యూ

‘గ్యాంగ్ లీడర్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నేచురల్ స్టార్ నాని. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ప్రియాంక హీరోయిన్. ఆర్ఎక్స్100 కార్తీకేయ విలన్ పాత్రలో నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఈ వారమే (సెప్టెంబర్ 13) నాని గ్యాంగ్ లీడర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకొంది. ‘యు/ఎ’ సర్టిఫికెట్ పొందింది. ఇక సినిమా చూసిన సెన్సార్ సభ్యులు గ్యాంగ్ లీడర్ అద్భుతంగా ఉందని కితాబిచ్చినట్టు సమాచారమ్.

నాని చెప్పినట్టుగా రివేంజ్ స్టోరీని కామెడీ టచ్ చెప్పడం బాగుంది. స్రీన్ ప్లేలోనూ ఎలాంటి గందరగోళం లేదట. కథ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఉందట. సినిమాలో రొమాంటిక్ డోస్ తక్కువ. ఎంటర్ టైన్ మెంట్ డోస్ ఎక్కువని చెబుతున్నారు. లేడీ గ్యాంగ్ తో కలిసి నాని చేసిన హంగామా కడుపుబ్బ నవ్వించేలా ఉందని సమాచారమ్. అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. సినిమా స్థాయిని పెంచేసింది. విలన్ పాత్రలో కార్తికేయ అదరగొట్టేశాడని చెబుతున్నారు. మొత్తానికి.. గ్యాంగ్ లీడర్ ప్రీ-రిలీజ్ టాక్ బ్లాక్ బస్టర్ హిట్. రేపు సినిమా టాక్ కూడా ఇదే అయితే.. నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడినట్టే.