వైకాపా బాధితుల శిభిరం.. 15 డిమాండ్లు !

‘ఛలో ఆత్మకూరు’తో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. వైకాపా బాధితులు అంటూ ఆత్మకూరులో తెదేపా ఓ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. వైకాపా కూడా తెదేపా బాధితుల లిస్టుని రెడీ చేసింది. ఈ లిస్టు చాలా పెద్దది. ఈ లిస్టులో ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైకాపా కీలక నేతలు కూడా ఉండటం విశేషం. ఈ విషయం పక్కనపెడితే.. గుంటూరులోని అరండల్ పేట వద్ద తెదేపా ఏర్పాటు చేసిన వైకాపా బాధితుల శిబిరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ శిబిరం వద్దకు భారీగా చేరుకున్నారు.

శిబిరంలో ఉన్న తెదేపా నేతలని బయటికి పంచించారు. ఆ తర్వాత బాధితులను వారి సొంత గ్రామాలకు తరలించేందుకు సంప్రదింపులు చేస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులు పోలీసుల ముందు 15 డిమాండ్లు ఉంచినట్టు సమాచారమ్. వీటిలో ఆర్థికపరమైన డిమాండ్స్ కూడా ఉన్నాయట. వాటిని ప్రభుత్వంతో చర్చిస్తామని పోలీసులు అన్నారు. గ్రామాల్లో వీరికి రక్షణ కల్పించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.