నాగ్‌పూర్‌ టెస్ట్ : కోహ్లీ శతకం.. పాంటింగ్‌ రికార్డు బ్రేక్‌

నాగ్‌పూర్‌ టెస్టుపై కోహ్లీ సేన పట్టుబిగించింది. కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సెంచరీ (100: 130 బంతుల్లో 10×4)తో అదరగొట్టాడు. టెస్టుల్లో విరాట్‌కు ఇది 19వ శతకం. అన్ని ఫార్మాట్లలో కలిపి 51వ శతకం కావడం విశేషం. ఈ యేడాది కోహ్లీ చేసిన 10వ సెంచరీ ఇది. గతంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ ఒక క్యాలెండర్‌ ఇయర్‌(2005, 2006)లో అత్యధికంగా 9 శతకాలు, గ్రేమ్‌ స్మిత్‌(2005)లో 9 సెంచరీలు సాధించారు. ఇప్పుడు వీరి రికార్డుని కోహ్లీ బ్రేక్ చేసేశాడు.

ప్రస్తుతం టీమిండియా 403/3 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది. కోహ్లీ 123 పరుగులు, రహానే 0పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటికే టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 200పరుగులకు పైగా ఆధిక్యతని సాధించింది. కోహ్లీ దూకుడు ముందు లంక బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం వచ్చేటట్టు కనబడటం లేదు. ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే భారీ ఆధిక్యం సాధించి లంకను రెండో ఇన్నింగ్స్ కి ఆహ్వానించేలా కనబడుతోంది.