‘గ్యాంగ్ లీడర్’ మేకింగ్ వీడియో చూశారా.. ? 

నేచురల్ స్టార్ నాని దర్శకుడు విక్రమ్ కె కుమార్ చేత కన్నీళ్లు పెట్టించాడు. నాని అద్భుత నటన చూసి విక్రమ్ కంటి నుంచి ఆనంద బాష్పాలు రాలాయ్. గ్యాంగ్ లీడర్ మేకింగ్ వీడియోలో ఈ సీన్ చూడొచ్చు. గ్యాంగ్ లీడర్ సినిమా మేకింగ్ వీడియోని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అభిమానులతో పంచుకుంది. ఇందులో నాని నటనకి విక్రమ్ ఫిదా అవ్వడం చూడొచ్చు. 

సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో హీరో నానితోపాటు దర్శకుడు విక్రమ్ కె.కుమార్ నవ్వులు పూయిస్తూ ఈ వీడియోలో కనిపించారు. అంతేకాకుండా ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ ఓ షాట్ లో మెరిశారు. ఇప్పటికే గ్యాంగ్ లీడర్ సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈ వారమే (సెప్టెంబర్ 13) గ్యాంగ్ లీడర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.