నరేష్ కు షోకాజ్ నోటీసులు

‘మా’లో లుకలుకలు బయటపడ్డాయి. మా అధ్యక్షుడు నరేష్ పదవి నుంచి తప్పుకోవాలని రాజశేఖర్ వర్గం డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా నరేష్ కి షోకాజ్ నోటీసులు పంపించారు. మా కొత్త అధ్యక్షుడిగా నరేశ్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వివిధ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రమాణ స్వీకారం రోజున నరేశ్ మీడియాతో మాట్లాడిన తీరు వివాదాస్పదం అయింది.

నరేష్ తీరుపై ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నరేష్.. నేను, నేను అని కాకుండా.. మేమంతా అని ప్రస్తావిస్తే బాగుంటుందని నవ్వుతూనే చురకలు అంటించారు. ఇప్పుడు రాజశేఖర్, నరేశ్ ల మధ్య స్నేహబంధం మరింత దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. తాజాగా రాజశేఖర్ వర్గం నరేశ్ కు షోకాజ్ నోటీసు ఇచ్చింది. అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసింది. దీనిపై నరేష్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.