ఆర్టీసీలో సమ్మె సైరన్
ఇన్నాళ్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు కురిపిస్తే.. ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారేది. ఇక్కడ జీతాలు పెంచితే.. అక్కడ పెంచాలనే డిమాండ్ వచ్చేది. ఆ కారణంగా చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బందులకి గురైన సందర్భాలున్నాయి. ఐతే, ఇప్పుడు సీన్ మారింది. ఏపీ తాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కేసీఆర్ ని మించిపోయాడు. చాలా ధైర్యంగా సంక్షేమ పథకాలని తీసుకొస్తున్నారు. గ్రామ సచివాలయాలని ఏర్పాటు చేస్తున్నారు. లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు.
ఏపీ ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో కలిపేయాలనే డిమాండ్ వినబడుతోంది. తాజాగా, టీఎస్ ఆర్టీసీ సమ్మె సైరన్ మ్రోగించింది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 25 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని ఆయన హెచ్చరించారు. మరీ.. ఆర్టీసీ విలీనంపై సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకొంటారనేది చూడాలి.