ప్రభాస్ తో జనగణమన


దర్శకుడు పూరి వద్ద జనగణమన కథ ఉంది. అప్పట్లో ఈ కథని మహేష్ కి వినిపించాడు. మహేష్ కి కూడా కథ నచ్చేసింది. దీంతో ఫస్ట్ లుక్ ని వదిలాడు పూరి. ఆ తర్వాత ఈ సినిమా అప్ డేట్స్ రాలేదు. ఇటీవల జగణమనపై పూరి స్పందించాడు. తాను హిట్స్ లో ఉంటేనే మహేష్ తనతో సినిమా చేస్తాడని కామెంట్స్ చేశాడు. ఈ విషయం పక్కనపెడితే.. జనగణమన కథ కోసం చాలామంది పేర్లు వినిపించాయి. రవితేజ, విజయ్ దేవరకొండతో జనగణమన పాడించబోతున్నట్టు ప్రచారం జరిగింది. 

తాజాగా జనగణమన కోసం రెబల్ స్టార్ ప్రభాస్ పేరు వినిపిస్తోంది. ఇటీవల ప్రభాస్ తో సినిమా చేసేందుకు పూరి ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు వినిపించాయి. ఇప్పుడది నిజమే అంటున్నారు. గతంలో పూరి-ప్రభాస్ కలయికలో రెండు సినిమాలు బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ వచ్చాయ్. వీటిలో బుజ్జిగాడు అంటే ప్రభాస్ కి బాగా ఇష్టం. మరీ.. వీరి కాంబో హ్యాట్రిక్ సినిమా ఓకే అవుతుందా ? అది జనగణమన అవుతుందా అనేది చూడాలి.