వీరంతా.. బాలపూర్ లడ్డూని దక్కించుకొన్నారు !


ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డ్ ధర పలికింది. ఏకంగా రూ. 17.60లక్షలకి కొలను రామిరెడ్డి బాలాపూర్ లడ్డూని సొంతం చేసుకొన్నారు. 1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలం కొనసాగుతోంది. ఆనాడు రూ. 450పలికిన బాలాపూర్ లడ్డూ..  ఈనాడు రూ. 17.60లక్షలు పలకడం విశేషం. యేడాది యేడాదికి లడ్డూ ధర పెరగడమే కానీ తగ్గడం ఉండదు. బాలాపూర్ లడ్డూని సొంతం చేసుకొన్న కుటుంబ సభ్యులకి వ్యాపారం బాగా కలిసివస్తుంది. అన్నీ రకాల మంచి జరుగుతుంటుందని చెబుతారు.

1994 నుంచి 2019 వరకు బాలాపూర్ లడ్డూని ఎవరు దక్కించుకొన్నారు. ఎంత ధరకు సొంత చేసుకొన్నారు అనే వివరాలని మీకోసం అందజేస్తోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.

* 1994 కొలన్ మోహన్‌రెడ్డి రూ. 450

*  1995 కొలన్ మోహన్‌రెడ్డి రూ. 4500
* 1996 కొలన్ కృష్ణారెడ్డి రూ.18,000

* 1996 కొలన్ కృష్ణారెడ్డి రూ.28,000

* 1998 కొలన్ మోహన్‌రెడ్డి రూ. 51,000

* 1999 కళ్ళెం ప్రతాప రెడ్డి రూ. 65,000

* 2000 కళ్ళెం అంజిరెడ్డి రూ. 66,000

* 2001 జి.రఘునందనా చారి రూ.85,000

*  2002 కందాడ మాధవరెడ్డి రూ. 1.05 లక్షలు

* 2003 చిగిరింత బాల్‌రెడ్డి రూ. 1.55 లక్షలు

* 2004 కొలన్ మోహన్‌రెడ్డి రూ. 2.01 లక్షలు

* 2005 ఇబ్రాం శేఖర్ రూ. 2.08 లక్షలు

* 2006 చిగిరింత తిరుపతిరెడ్డి రూ. 3 లక్షలు
 * 2007 రఘునందనా చారి రూ. 4.15 లక్షలు

* 2008 కొలన్ మోహన్‌రెడ్డి రూ. 5.07 లక్షలు

* 2009 సరిత రూ. 5.10 లక్షలు

* 2010 శ్రీధర్ బాబు రూ. 5.30 లక్షలు

* 2011 కొలన్ ఫ్యామిలీ రూ. 5.40 లక్షలు

* 2012 పన్నాల గోవర్ధన్ రెడ్డి రూ. 7.50 లక్షలు

* 2013 తీగల కృష్ణారెడ్డి రూ. 9.26 లక్షలు

* 2014 జైహింద్‌రెడ్డి రూ. 10 లక్షలు

* 2015 కళ్ళెం మదన్‌మోహన్‌రెడ్డి రూ. 10.32 లక్షలు

* 2016 స్కైలాబ్ రెడ్డి రూ. 14.65 లక్షలు
 * 2017 నాగం తిరుపతిరెడ్డి రూ.15.60 లక్షలు

* 2018 శ్రీనివాస్ గుప్తా రూ. 16.60 లక్షలు

* 2019 కొలన్ రాంరెడ్డి రూ. 17.60 లక్షలు